కడప జిల్లాలో మహిళల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో మహిళలు, బాలికలతో సమావేశాలు ఏర్పాటు చేసి భద్రత, చట్టాలు, సైబర్ నేరాలపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.