NZB: నగర శివారులోని సారంగాపూర్ పరిధిలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు సీపీ సాయి చైతన్య ఆదేశాలతో, సీసీఎస్ ఇన్ఛార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేయగా, వారి నుంచి 7 సెల్ ఫోన్లు, రూ. 5300 నగదును స్వాధీన పరుచుకున్నారు.