PPM: సీతానగరం బస్ స్టాండ్ వద్ద గురువారం బస్సులో నుంచి జారిపడ్డ మహిళ శనివారం ఉదయం మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. రామభద్రపురం గొల్లవీధికి చెందిన కొయ్యాన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజ ముగించుకుని వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.