MHBD: రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో ఎమ్మెల్యే మురళి నాయక్ భేటీ అయ్యారు. ఆలేరు నుంచి తారా సింగ్ తండా వరకు రోడ్డును మంజూరు చేసినందుకుగాను రాజ్యసభ సభ్యుడికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.