AP: విభాజిత ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతగానో శ్రమించిన చంద్రబాబును 2019లో ప్రజలు ఓడించడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి అచ్చెన్న అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయలేనంత అభివృద్ధి-సంక్షేమాన్ని 2014-19 కాలంలో CBN అందించారు. అప్పటికీ ఆయనను కాదని వేరొకరికి ఓటు వేసి రాష్ట్ర ప్రజలు తప్పు చేశారంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని శాసనసభ సాక్షిగా వెల్లబుచ్చారు.