MBNR: ఈ నెల 31న పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో 500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ తెలిపారు. టెన్త్ లేదా అంతకంటే ఎక్కువ చదివి, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్న యువతీ యువకులు అర్హులన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో ఈ మేళాకు హాజరుకావాలని ఆమె సూచించారు.