SKLM: పొందూరు మేజర్ పంచాయితీ సర్పంచ్ రేగిడి లక్ష్మి వైసీపీకి రాజీనామా చేసినట్లు శనివారం తెలిపారు. వైసీపీలో మహిళలకు గుర్తింపు లేదని, దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు. త్వరలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తానని అన్నారు. పొందూరు రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో పంచాయతీలో ఆమె ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనే చర్చ నడుస్తోంది.