AP: రాజధాని కోసం రైతులు 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములు ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. భూములిచ్చిన రైతులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానని వెల్లడించారు. రైతులు ఇచ్చింది భూములు కాదని.. 5 కోట్ల ప్రజలకు భవిష్యత్ ఇచ్చారని కొనియాడారు. రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. రాజధానికి డబ్బులు ఇవ్వొద్దని వైసీపీ ప్రపంచబ్యాంకుకు లేఖలు రాసిందన్నారు.