NZB: సిరికొండ మండలం పెద్ద వాల్గోట్లో సర్పంచ్ పిట్ల వనిత ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గద్దల రాజారం, ఏరుగట్ల రాజన్నలకు రూ. 60 వేల చొప్పున, మరికొందరికి కలిపి మొత్తం రూ. 2.17 లక్షల సాయం అందింది. చెక్కుల మంజూరుకు కృషి చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.