AP: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. AP అభివృద్ధి కోసం శిల్పిలా కష్టపడితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం ఎంతో చేసిన చంద్రబాబును ఓడించడం కంటే.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచేసిన దొంగకు ప్రజలు అధికారం అందించడం మరింత బాధించిందన్నారు.