హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నలేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘ప్రేమకు అంకితం, ప్రేమ నుంచే పుట్టిన గీతం ఓ సుందరి.. ‘రావు బహదూర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ఓ సుందరి ఏప్రిల్ 15న విడుదలవుతోంది’ అని తెలిపారు.