VSP: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసి, ప్రాధాన్యత లేని పోస్టులో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. భూముల లీజులు, ఆలయ ఆస్తుల వ్యవహారాల్లో అక్రమాలు సహా పలు ఆరోపణలు రుజువయ్యాయి. నిర్బంధ ఉద్యోగ విరమణకు సిఫార్సు చేసినా ఫైల్ ఆలస్యమైందని అధికారులు తెలిపారు. ఏడాదిలోపు చర్యలు లేకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తివేశారు.