SS: సోమందేపల్లి మండలం రేణుకనగర్లో 50 కోళ్లు ఆకస్మిక మృతి చెందాయి. గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన వారు కోళ్లను పెంచుకొని జీవనం కొనసాగించేవారు. గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారని, తమ జీవనోపాధి అయిన కోళ్లని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్లనే అమ్ముకొని మేము జీవనం చేసేవారని అవి లేకపోవడంతో ఇప్పుడు మా జీవనం ఎలా గడపాలని ఆవేదన వ్యక్తం చేశారు.