ఏలూరు: జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ఏపీఈపీడీసీఎల్ సరికొత్త AI యాప్ను అందుబాటులోకి తెస్తోందని ఎస్ఈ సాల్మన్ రాజు తెలిపారు. కేవలం ఒక ఫొటోతో ముందస్తుగా ప్రమాదాలను పసిగట్టడం దీని ప్రత్యేకత. ఎనిమిది ఫీడర్ల పరిధిలో తనిఖీలు చేయగా ఈ యాప్ 93% కచ్చితత్వంతో విద్యుత్ లోపాలను గుర్తించిందన్నారు. విద్యుత్ సమస్యలు, ప్రమాదాలపై 1912 నంబరు సమాచారం ఇవ్వాలన్నారు.