KRNL: దేవనకొండలో అర్హులైన దివ్యాంగులు తమ సదరం సర్టిఫికెట్ పొందే అవకాశం ఇవాళ నుంచి ప్రారంభమైందని MPDO జ్యోతి వెల్లడించారు. ఈ నెల 28 చివరి తేదీ అని తెలిపారు. దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. ఈ సదుపాయాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.