AP: మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. 10 మంది సజీవదహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.