KMR: పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని గాంధారి తహసీల్దార్ రేణుక చౌహన్ అన్నారు. ఇవాళ మండల కేంద్రంలో 69 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పరమేశ్వర్, పలువురు నాయకులు ఉన్నారు.