TG: సికింద్రాబాద్లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కన్న తల్లిని చంపిన కూతురు.. ఇంట్లోనే పాతిపెట్టింది. తన ప్రేమకు అడ్డుపడిందని తల్లి అంజును కూతురు చంపింది. జవహర్ నగర్ పరిధిలో ఏడాది క్రితం ఈ అమానుష ఘటన జరగగా.. తల్లి అదృశ్యంపై పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిందితులు నిజం ఒప్పుకున్నారు.