TG: ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా అవసరమైన అన్నిరకాల పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కాంగ్రెస్ ప్రజా పాలన రెండేళ్లలో సుమారు 10 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశలో ఉందని మంత్రి వెల్లడించారు.