మాజీమంత్రి కొడాలి నానిపై మంత్రి డీఎస్బీవీ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. బూతులు మాట్లాడే కొడాలి నాని.. నీతులు చెప్పడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ అవినీతి, అరాచక చరిత్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. గత ఐదేళ్లు జగన్ చేసిన అరాచకాలు భరించలేకే వైసీపీని తరిమికొట్టారన్నారు. ప్రజల ఆశీస్సులతో కూటమి పాలన సుదీర్ఘకాలం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.