కృష్ణా: చల్లపల్లిలోని నిమ్మలతోటలో ఉన్న సీయోను వృద్దాశ్రమంలో శనివారం సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. శనివారం మధ్యాహ్నం నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు శీలం భాస్కరరావు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల కేక్ కట్ చేసి పంచిపెట్టారు.