NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనుండగా, 28న పూర్ణాహుతి, ఉత్సవ సమాప్తి, శ్రీరాముల పట్టాభిషేకం జరగనుంది. మార్చి 26న ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.