MBNR: రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. విద్యకు కేవలం 8.22% నిధులు ఇవ్వడం విద్యార్థులను మోసం చేయడమేనని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్ విమర్శించారు. 20-30% నిధులు కేటాయించాలని, లేదంటే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.