ఖమ్మం జడ్పీ కార్యాలయంలో ఈరోజు ప్రముఖ కవి రెంటాల చిన్న హుస్సేన్ రచించిన ‘శశిర సింధూరం’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాహిత్యాభిమానులు, కవులు, మేధావులు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాహిత్య ప్రముఖులు మాట్లాడుతూ.. కవిత్వం సమాజంలోని భావోద్వేగాలు, అనుభవాలు, సామాజిక వాస్తవాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు.