ప్రముఖ ఒడిస్సీ కళాకారిణి మధుమిత రౌత్(59) గుండెపోటుతో కన్నుమూశారు. 1950వ దశకంలో శాస్త్రీయ పరిజ్ఞానంతో ఒడిస్సీ నృత్య పునరుద్ధరణకు దోహదపడిన మాయధర్ రౌత్ కుమార్తెనే మధమిత్ రౌత్. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. మధుమిత అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను పొందారు.