సత్యసాయి: పరిగి(మం) హైవే వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్ గుర్తులు గత మూడు రోజులుగా పడిపోయి ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన పరిగి చిన్నపల్లి గ్రామానికి చెందిన యువకులు శనివారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిగ్నల్ గుర్తులను సరిచేశారు. యువకుల ఈ సేవా భావాన్ని గ్రామ పెద్దలు అభినందించారు.