E.G: మండపేట(మం) ద్వారపూడి, కేశవరంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.