NRML: పట్టణంలోని రామ్ మందిర్లో గల శ్రీ సీత రామాంజనేయ మందిరంలో ఈ నెల 27న జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పోస్టర్లను శనివారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మహోత్సవానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ ఆవిష్కరణలో కౌన్సిలర్లు, కత్తి నరేందర్ పాల్గొన్నారు.