AKP: నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకు పండగ వచ్చినట్లుగా ఉందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈమేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు చెందిన నిరుద్యోగ యువతకు స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.