మైక్రోసాఫ్ట్ ఇటీవల తీసుకొచ్చిన విండోస్ 11 అప్డేట్ లక్షలాది మంది వినియోగదారులకు ఒక కొత్త సమస్యను సృష్టించింది. 24H2, 25H2 వెర్షన్లలోని ఒక బగ్ కారణంగా మైక్రోసాఫ్ట్ ఖాతాతో లాగిన్ అవ్వడం కష్టంగా మారింది. ఇంటర్నెట్ ఉన్నప్పటికీ, వన్‌డ్రైవ్, ఆఫీస్, టీమ్స్ వంటి యాప్‌లలో వినియోగదారులకు నో ఇంటర్నెట్ అనే ఎర్రర్ కనిపిస్తోంది.