VZM: మెరకముడిదాం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో శనివారం శాఖల పనితీరుపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని, విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకి సూచించారు.