KRNL: ఈనెల 24న నిర్వహించనున్న CPI ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఇంటి స్థలం లేని పట్టణ పేదలకు 2 సెంట్ల ఇంటి జాగా ఇవ్వాలన్నారు.