PDPL: సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. సింగరేణి కార్మికుడు తిరుపతి భార్య సుమలత గతేడాదిగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చేరడంతో వైద్య పరీక్షలు చేసిన అనంతరం కడుపులో ఉన్న నాలుగున్నర కిలోల కణతిలను తొలగించారు. వైద్యాధికారి డాక్టర్ అంబికా పర్యవేక్షణలో డాక్టర్లు ఇందిరా, మద్దిలేటి, వినోద్ కుమార్, శ్యామల ఆపరేషన్ విజయవంతం చేశారు.