వివాహ బంధంపై మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బంధంలో కొనసాగడానికి పెళ్లి అనేది అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నవాళ్లను తక్కువగా చూశానని.. వైవాహిక జీవితంలో వచ్చే విబేధాలు, ఒత్తిడి కెరీర్‌పై ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి కంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కే మొగ్గుచూపుతానని తేల్చి చెప్పింది.