AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.