MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామ శివారు ఆకేరు వాగు నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చే ట్రాక్టర్లను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి గాయాలు కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సంబంధిత ట్రాక్టర్ డ్రైవర్ పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన జల్లక ప్రవీణ్‌గా గుర్తించారు.