TG: కరీంనగర్ జిల్లాలో భార్య మృతి తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర పోలీస్ శాఖ స్పందించింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు.. చట్టాన్ని కాపాడే కళ్లలో చిక్కుకున్న కన్నీటిగాథలు.. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఖాటిక కట్టుకుని కడవరకు పయనించి.. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై చంద్రశేఖర్ దంపతులకు నివాళులు’ అంటూ ట్వీట్ చేసింది.