JN: పాలకుర్తి మండల కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో పండుగ వాతావరణం నెలకొంది.