KMM: కూసుమంచి మండలం బికారీతండాలో శనివారం విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోతు శ్రీను తన పొలంలో కోసిన ధాన్యాన్ని ట్రాక్టర్లోకి నింపుతుండగా ప్రమాదవశాత్తు పైనున్న 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.