ప్రకాశం: కనిగిరి మండలం నల్లరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడడంతో పొలంలో ఉన్న సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.