IPLలో ఒక్క క్యాచ్‌తో రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్ ఫలితం మారిపోయిన సందర్భాలెన్నో. ఇలా ఎన్నో మ్యాచ్ ఫలితాలను తన క్యాచ్‌లతో మలుపుతిప్పిన రికార్డ్ కోహ్లీ సొంతం. అవును, ధనాధన్ లీగ్‌లో అత్యధికంగా 117 బంతులను ఒడిసిపట్టిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. రైనా(109), జడేజా(109*), పొలార్డ్(103) తర్వాతి స్థానాల్లో ఉండగా.. రోహిత్(102*) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.