ATP: రాప్తాడు నియోజకవర్గం మన్నీల గ్రామానికి చెందిన టీడీపీ నేత చిగిచెర్ల ఎల్లారెడ్డి గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు.