పాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో IPL 2026 కోసం SRH ఇషాన్‌ను తమ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో భువనేశ్వర్ కుమార్ తర్వాత SRHను నడిపించనున్న రెండో భారత సారథిగా ఇషాన్ నిలవనున్నాడు. IPL 2019లో నాటి కెప్టెన్ కేన్ అందుబాటులో లేకపోవడంతో భువీ 6 మ్యాచులకు సారథిగా వ్యవహరించాడు. ఆపై 2022 & 23 సీజన్లలోనూ ఒక్కో మ్యాచులో జట్టును నడిపించాడు.