TG: హైదరాబాద్కు చెందిన సృజన్ జ్యువెలరీ అధినేత రవికుమార్ తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు అన్నప్రసాద సేవలను విస్తరించే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు మరో రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. విరాళం అందించిన దాతకు బీఆర్ నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Tags :