AP: రైతులకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి వర్ష సూచన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. వర్షాలకు దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలన్నారు. రైతులు పండిన పంటలను త్వరగా సేకరించి భద్రపరచాలని.. వడగళ్ల వాన, ఈదురుగాలుల వేళ పొలాల్లో ఉండకూడదని సూచించారు.