TG: హైటెక్స్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. అవార్డులు నటుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. కొన్నాళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సినిమా పురస్కారాలను సీఎం రేవంత్ పునరుద్ధరించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.