సత్యసాయి: గత వైసీపీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని మంత్రి సవిత విమర్శించారు. శుక్రవారం సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉగాది సందర్భంగా మంత్రి లోకేశ్ 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.