ADB: పని ప్రదేశాలలో, సమాజంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ITDA APO దామోదర స్వామి అన్నారు. శుక్రవారం ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.