సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే ఒకడు నా నడుము గిల్లి వెళ్లిపోయాడు. ఆ ఘటన జరిగిన సమయంలో ఎంతోమంది చుట్టూ ఉన్నారు. కానీ ఒక్కరూ ముందుకు వచ్చి ఆపలేదు. నాకు ఇప్పటికీ తప్పుడు ఉద్దేశాలతో ఫోన్ కాల్స్ వస్తుంటాయి‘ అని భావోద్వేగానికి గురైంది.