NTR: వత్సవాయి మండలం డబ్బాకుపల్లిలో శుక్రవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మురళీకృష్ణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కీలకమని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి రూ.5 లక్షల బీమాను జనసేన పార్టీ అందిస్తుందని తెలిపారు.